ప్రజాశక్తి-చిలమత్తూరు(శ్రీ సత్యసాయి జిల్లా) : మండల పరిధిలోని కోడూరు తోపు 44వ జాతీయరహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్నవరంకు చెందిన ధుర్గేష్(25) వీరయ్యలు అనంతపురం వైపు ద్విచక్రవాహణంలో వెలుతున్నారు. ఈ క్రమంలో వెనుకవైపు నుండి లారీ డీకొంది. ఈ ఘటనలో ధుర్గేష్(25) అక్కడికక్కడే ధుర్మణం చెందగా వీరయ్య పరిస్థితి విశమంగా ఉంది. స్థానికులు వీరయ్యను బాగేపల్లి ఆసుపత్రికి తరలించారు.










