కురుపాం: మండలంలో బియ్యాలవలస పంచాయతీ మంత్రజోల సమీపాన ఒంటరి ఏనుగు సంచరిస్తుండడంతో గిరిజన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం మంత్రజోల సమీపాన ఒంటరి ఏనుగు సంచరిస్తుందని మంత్రజోల, దురుబిలి, పెళ్లి వలస, సూర్యనగరం, నేరడవలస గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామాల గిరిజన ప్రజలు మాట్లాడుతూ ఈ ఒంటరి ఏనుగు కొమరాడ మండలంలో బస్సు అద్దంపై దాడి చేసి మనుషులపై వెంటాడిందని అదే ఏనుగు మా ప్రాంతంలో సంచరిస్తుండడంతో మేము బయటకు రావాలంటే భయమేస్తుందని ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తుందని మేమ అడవికి పొలాలకు వెళ్తే గానీ తమకు జీవనం సాగదని, అటువంటిది ఈ ఏనుగు సంచారం వల్ల బయటకు రాలేకపోతున్నామని కావున అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగును దూర ప్రాంతాలకు తరలించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నామన్నారు.










