ప్రజాశక్తి - చిప్పగిరి
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌తో తమ కుటుంబ సభ్యులకు, తమకు ఎలాంటి విభేదాలూ లేవని ఎంపిపి జూటూరు హేమలత మారయ్య దంపతులు తెలిపారు. శనివారం మండల కార్యాలయంలోని ఎంపిపి కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల పత్రికల్లో, ఎన్‌టివి ఛానెల్‌లో, మంత్రికి, ఎంపిపి దంపతులకు విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. చిన్న, చిన్న సమస్యలుంటే మంత్రితో మాట్లాడి పరిష్కరించుకుంటున్నామని తెలిపారు. మండలంలో వైసిపి అభివృద్ధికి కషి చేస్తున్నట్లు చెప్పారు. ఆలూరు నుంచి 2024 ఎన్నికల్లో మంత్రి జయరామ్‌ను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని చెప్పారు. ప్రతిపక్ష టిడిపి నాయకులు ఎన్ని ఎత్తులు వేసినా సాగవన్నారు. వైసిపి నాయకులు జూటూరు లాల్‌స్వామి, జూటూరు లింగన్న, రాజు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎంపిపి జూటూరు హేమలత మారయ్య










