May 02,2023 09:53

అర్జీదారునితో మాట్లాడుతున్న కలెక్టర్‌ అరుణ్‌ బాబు

          పుట్టపర్తి అర్బన్‌ :ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, మండల, డివిజన్‌ స్థాయిలోనే అర్జీలకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అరుణ్‌ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో స్పందన అర్జీలను 109 మందితో స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు డిఆర్‌ఒ కొండయ్య, ఆర్డీవో భాగ్యరేఖ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ డివిజన్‌, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలను అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి జిల్లాస్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. కొత్త జిల్లా కావడంతో కొన్ని శాఖల అధికారులు రెండు జిల్లాలను చూడాల్సి వస్తుందన్నారు. అలాంటి అధికారులు ఒకవారం అనంతపురం ఇంకొకవారం పుట్టపర్తికి రావాలన్నారు. ఎక్కువగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, గహ నిర్మాణ శాఖలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, ఎక్కువగా రీ ఓపెనింగ్‌ అవుతున్నాయని, గ్రీవెన్స్‌లో పరిష్కారం అయ్యే విధంగా ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ను అన్ని శాఖలు ప్రత్యేకంగా నియమించుకోవాలన్నారు. కిందస్థాయిలోనే పరిష్కరిస్తే, పైస్థాయి వరకు అర్జీదారులు రారన్నారు. జగనన్నకు చెపుదాం అనే కార్యక్రమానికి మన జిల్లాకు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి చక్రధర్‌, ప్రభుత్వం నియమించిందని 3వ తేదీ వస్తున్నారని, స్పందన పై అధికారులందరూ సన్నద్ధం కావాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పనులు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌లు, నిర్మాణాలు ఆగస్టు 30 లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. మంగళవారం ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ అజైరు జైన్‌ జిల్లాకు రానున్నారని 11 గంటలకు కలెక్టరేట్‌ లో సమావేశం ఉంటుందని గహ నిర్మాణాలపై ఆ శాఖ అధికారులు, ఎంపీడీవోలతో సమీక్షిస్తారని అందుకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలన్నారు. డ్వామా పరిధిలో వివిధ పనులకు సంబంధించి 7 కోట్లు బిల్లులు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిపిఒ విజరుకుమార్‌, గహ నిర్మాణ శాఖ పీడీ చంద్రమౌళిరెడ్డి, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, పిఆర్‌ ఎస్‌ఇ గోపాల్‌ రెడ్డి, వ్యవసాయ అధికారి సుబ్బారావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.