Oct 17,2023 20:04

అధ్యక్షులుగా ఎన్నికైన వారికి పూలమాలతో సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - చిప్పగిరి
ఎపిడబ్ల్యుజెఎఫ్‌ మండల అధ్యక్షులుగా కుందనగుర్తి యూసుఫ్‌ మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎపిడబ్ల్యుజెఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆలూరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలూరు తాలూకా అధ్యక్షులుగా రాజు (10టివి), ప్రధాన కార్యదర్శిగా కృష్ణ (ప్రజాశక్తి)తో పాటు కమిటీని ఎన్నుకున్నారు. చిప్పగిరి మండలం గౌరవాధ్యక్షులుగా గోవిందరాజులు, ఎపిడబ్ల్యుజెఎఫ్‌ అధ్యక్షులుగా యూసుఫ్‌ (సూర్య వెలుగు), కార్యదర్శిగా రవి (ప్రజాశక్తి), ఉపాధ్యక్షులుగా సి.కృష్ణమూర్తి (దిశా), శివ, రాజన్న, సభ్యులను ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు యూసుఫ్‌ మాట్లాడుతూ... పాత్రికేయుల అభివృద్ధితోపాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.