Oct 07,2023 00:36

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌

ప్రజాశక్తి-చింతూరు
మండల కేంద్రం చింతూరు పంచాయతీ పరిధి అల్లిగూడెం గ్రామంలో మంచినీటి బోరు ప్యానెల్‌ బోర్డుకు మరమ్మతుల నిర్వహించి మంచినీటి బోరును రిపేర్‌ చేయించి గ్రామ ప్రజలకు తాగునీటిని అందించాలని సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌ డిమాండ్‌ చేశారు. అల్లిగూడెం గ్రామంలో శుక్రవారం జరిగిన సమావేశంలో గ్రామంలో నెలకొన్న మంచినీరు, వీధి రోడ్లు, వీధిలైట్లు, ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు హక్కు పత్రాలు తదితర సమస్యలు గ్రామస్తులు తెలియజేశారు. అనంతరం సీసం సురేష్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తాగునీరు, రోడ్లు, వీధిలైట్లు వంటి కనీస మౌలిక వసతులను కల్పించలేదని స్థితిలో ఉందని పేర్కొన్నారు. అల్లిగూడెంలో వాటర్‌ ట్యాంక్‌ మోటర్‌ పాడైపోయిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి రెండు నెలలు కావస్తున్నా నేటికీ ఎలాంటి పరిష్కారం చూపలేదన్నారు. గ్రామంలోని అంతర్గత రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని, వీధిలైట్లు ఏడాదిగా వెలగకపోయినా ఏ ఒక్క అధికారీ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పై సమస్యలను పరిష్కరించాలని, ఆదివాసీలకు కులం సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు మురం, రంగమ్మ, పోడియం లక్ష్మణ్‌, గ్రామస్తులు కూర భీమయ్య, మడకం లక్ష్మణ్‌, ఆనంద్‌, కూర లక్ష్మణ్‌, దేవయ్య, వంగయ్య, కిషోర్‌ పాల్గొన్నారు.