Apr 02,2023 23:08

vamsi

మంచి ఫలితాలు సాధించండి
పదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే వంశీ సూచన
ప్రజాశక్తి-గన్నవరం
సోమవారం నుంచి జరిగే 10 వ తరగతి పరీక్షలను రాస్తున్న గన్నవరం నియోజకవర్గంలోని విద్యార్థులు సమర్ధవంతంగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీ పిలుపునిచ్చారు. బాల బాలికల భవిష్యత్తు నిర్ణయించేది టెన్త్‌ క్లాసేనని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని పేర్కొన్నారు.