మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను సన్మానిస్తున్న జిల్లా కెడిసిసి డైరెక్టర్ రాఘవేంద్ర
ప్రజాశక్తి - ఆస్పరి
వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు వేసిన పంటలు మంచి దిగుబడి రావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ ఆకాంక్షించారు. శుక్రవారం దేవనకొండ మండలం పల్లెదొడ్డి గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' ముగించుకొని ఆలూరుకు వెళ్తున్న మంత్రి ఆస్పరి కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని తెలిపారు. ముందుగా జిల్లా కెడిసిసి డైరెక్టర్ రాఘవేంద్ర మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను, వైసిపి ఆలూరు ఇన్‌ఛార్జీ గుమ్మనూరు నారాయణ స్వామిని సన్మానించారు. మాజీ జడ్‌పిటిసి రాంభీంనాయుడు, రైతులు పాల్గొన్నారు.










