ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలోని టిడిపి కార్యాలయంలో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో మిషన్ రాయలసీమ కరపత్రాలను ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చేతులమీదుగా శనివారం యువత ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడారు. యువనేత నారా లోకేష్ 'యువగళం' పాదయాత్ర రాయలసీమ పర్యటనలో భాగంగా వెనుకబడిన రాయలసీమకు 2024 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే చేసే అభివృద్ధి, హామీలను ప్రజల్లో తీసుకెళ్లి చైతన్య పరచడమే ప్రధాన లక్ష్యమన్నారు. టిడిపి కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి, యువ నాయకులు మారుతి నాయుడు, సిద్ధార్థ్ నాయుడు, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్ చౌదరి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు, తెలుగు యువత మండల అధ్యక్షులు వీరేంద్ర, తెలుగు యువత ప్రతాప్, టిఎన్‌ఎస్‌ఎఫ్ తేజ, సూర్య, బుద్ధారెడ్డి, అయ్యన్న, నెట్టేకల్, నాగరాజు, సోము పాల్గొన్నారు.
కరపత్రాలు విడుదల చేస్తున్న మీనాక్షి నాయుడు










