Nov 03,2023 21:39

ఫొటో : మాట్లాడుతున్న మండల వ్యవసాయ అధికారి వి.రవికుమార్‌

మినుము పంట పరిశీలన
ప్రజాశక్తి-వరికుంటపాడు : మండలంలోని డక్కునూరు గ్రామంలో సాగులో ఉన్న మినుమ పంటను శుక్రవారం మండల వ్యవసాయ అధికారి వి.రవికుమార్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో పంటలు సాగు చేసే రైతులు వ్యవసాయ సిబ్బంది సూచనలు సలహాలు పాటిస్తూ సాగులో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు మినిమ పంటకు ఏమీ ఇబ్బంది లేదని బాగుందన్నారు. సాగులో ఉన్న వరిలో ఆకు మడత తెగులు ఉందని నివారణ చర్యలు పాటించాలన్నారు.
శెనగ విత్తనాలకు మండలంలో ఇప్పటికీ రెండు వందలమంది రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారన్నారు. విరువూరు, వరికుంటపాడు ఆర్‌.బి.కెలో రిజిస్ట్రేషన్లు జాబితాలు ప్రదర్శించామన్నారు. 7న రైతుల ఖాతాలో రైతు భరోసా నగదు జమవుతుందన్నారు. మండలంలో 6552మంది రైతులకు కోటి 31 లక్షల రూపాయలు లబ్ధి చేకూరిందన్నారు.