Apr 27,2023 22:58

ప్రజాశక్తి కలక్టరేట్‌(కృష్ణా) : లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించారని కష్ణాజిల్లా కలెక్టర్‌ పి. రాజాబాబు అన్నారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలను కలెక్టర్‌ ఛాంబర్‌ లో గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు మాట్లాడుతూ, మహర్షి భగీరథుడు మహా జ్ఞాని, పరోపకారానికి పెట్టింది పేరని అన్నారు. అకుంఠిత దీక్షకు, సహనానికి ప్రతిరూపమని ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారని, ఎవరైనా కఠోర శ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని ఈనాటికి చెప్పుకుంటామని నీటిని దివి నుంచి భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని అన్నారు. భగీరథ దీక్షతో ప్రభుత్వ సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేలా కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బిసి కార్పొరేషన్‌ ఇడి, బీసీ వెల్ఫేర్‌ ఇంచార్జ్‌ ఏ. శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ వై. ఇందిరా, రాష్ట్ర సగర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నక్కా శ్రీనివాసరావు, వాణిజ్య విభాగ అధ్యక్షులు కోటిరెడ్డి భీమారావు పాల్గొన్నారు.