Jun 09,2023 22:28

పంటపొలాల్లో ఎలుగుబంటి

ప్రజాశక్తి ఆత్మకూరు : మండల పరిధిలోని బి.యాలేరు గ్రామసమీపంలో శుక్రవారం ఉదయం గ్రామానికి చెందిన మహిళపై దాడి చేసింది. ఈ దాడిలో మహిళ కంటికి గాయమైంది. ఆమెను చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. గ్రామానికి చెందిన నల్లక్క అనే మహిళ శుక్రవారం ఉదయం పొలం పనుల్లోకి వెళుతున్న సమయంలో ముళ్లపొదల్లో దాగి ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా మహిళవైపు వచ్చింది. అది చూసిన ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో బెదిరిన ఎలుగుబంటి మహిళపై దాడి చేసింది. ఈసందర్భంగా నల్లక్క వేసిన కేకలకు అటువైపు వెళుతున్న వారు గట్టిగా కేకలు వేసుకుంటూ ఘటనాస్థలం వద్దకు వచ్చారు. జనాన్ని చూసిన ఎలుగుబంటి పారిపోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి ముళ్లపొదల్లో ఉన్న ఎలుగుబంటిని లోకి వెళ్లిన సమయంలో ముళ్లపొదల్లో దాగివున్న ఎలుగుబంటి ఒక్కసారిగా వలల సాయంలో బంధించారు. ఎలుగుబంటి దాడిలో గాయపడిన నల్లక్కను చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు.