Nov 05,2023 01:09
యూనిట్లను పంపిణీ చేస్తున్న డిఆర్‌డిఏ పిడి రవికుమార్‌

ప్రజాశక్తి-కొనకనమిట్ల: సమాజంలో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని డిఆర్‌డిఏ పిడి తేళ్ల రవికుమార్‌ అన్నారు. శనివారం మండలంలోని చినమనగుండం గ్రామంలో స్వయం సహాయక గ్రూపు సభ్యులకు ప్రధానమంత్రి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్రోగ్రాం కింద సుస్థిర జీవనోపాధుల యూనిట్లను వైఎస్సార్‌ క్రాంతి పథం జిల్లా డిఆర్‌డీఏ పిడి రవికుమార్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. యూనిట్లను ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెంది పలువురికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. యూనిట్లను సక్రమంగా నిర్వర్తించుకొని రుణాలను క్రమం తప్పకుండా చెల్లించి తిరిగి రుణాలను పొందాలని అన్నారు. డిపిఎం డేవిడ్‌, బ్యాంకు లింకేజ్‌ యాంకర్‌ పర్సన్‌ సుబ్బారావు ఆధ్వర్యంలో రూ.21 లక్షలతో బూందీ మిక్చర్‌, పచ్చళ్ల తయారీ, చిక్కీ యూనిట్లను జి భాగ్యలక్ష్మి, ఎం రవణమ్మ, జి సుబ్బులు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం కే గోపాలకృష్ణారెడ్డి, సీసీలు పాల్గొన్నారు.