మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ప్రజాశక్తి-గన్నవరం
కృష్ణాజిల్లా క్రీడాప్రాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో గన్నవర మండల స్థాయిలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం గన్నవరం మండల స్థాయిలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఎంతో మంది మహిళలు పోటీపడి పాఠశాల ప్రాంగణాన్ని రంగవల్లులతో తీర్చిదిద్దారు. తరువాత పాఠశాల ప్రధానోపాధ్యాయిని నిమ్మగడ్డ రవీంద్రభవాని అధ్యక్షతన మ్యూజికల్ చైర్స్, పాటల పోటీలు నిర్వహించారు. కృష్ణాజిల్లా క్రీడాప్రాధికార సంస్థ తరపున విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. పాటల పోటీ విజేతలు వరుసగా బి.రమ్యశ్రీ, డి.ప్రహర్ష, కె.అక్షిత ప్రథమ, ద్వితీయ తతీయ స్థానాల్లో నిలిచారు. ముగ్గుల పోటీల్లో 21 మంది మహిళలకుగాను డి.షారోనా రాణి, బి.ఐశ్వర్య, జె.సంతోషమ్మ ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాలు సాధించారు. మ్యూజికల్ చైర్స్‌లో 18 మందికిగాను ఎం.శ్రావణి, బి.ఐశ్వర్య, డి.మద్విత వరుసగా ప్రథమ, ద్వితీయ, తతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. కార్యక్రమ నిర్వహణ ఆసాంతం పాఠశాల వ్యాయామోపాధ్యాయులు దనాల నాగరాజు నిర్వహించారు. బహుమతులను ఉభయ కృష్ణాజిల్లాల రిటైర్డ్ ఎపి ఫైర్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వాకర్స్ అసోసియేషన్ గన్నవరం కార్యదర్శి చిప్పాడ చంద్రశేఖర్ స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఉపాధి కల్పనా ఆఫీసర్ విక్టర్‌బాబు, అంతర్జాతీయ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు










