Aug 25,2023 19:48

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
మహిళ ఆర్థికాభివృద్ధికి బాసటగా నిలుస్తూ, ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తూ మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ ఆసరా, సున్నా వడ్డీ, చేయూతను అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలను పాఠశాలకు పంపి విద్యనందించాలనే సంకల్పంతో, నిరక్షరాస్యత నిర్మూలన దిశగా అమ్మఒడి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. విద్యాదీవెన, వసతి దీవెన కింద 2516 మందికి రూ.251.6 లక్షలు, వైఎస్‌ఆర్‌ ఇబిసి నేస్తం కింద 195 మంది ఉన్నారని తెలిపారు. కాపు నేస్తం, వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కింద 9,515 మందికి రూ.2.68 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. వాహన మిత్ర కింద 292 మందికి రూ.29.2 లక్షలు, వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కింద రూ.333.12 లక్షలు వేస్తున్నట్లు తెలిపారు. వైసిపి మండల కన్వీనర్‌ బిఆర్‌.బసిరెడ్డి, మెప్మా సభ్యులు భవాని, రత్నమ్మ, పార్వతి, విజయలక్ష్మి, గౌరమ్మ, పుష్ప, సునీత, జయలక్ష్మి పాల్గొన్నారు.