ప్రజాశక్తి - భామిని : స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీతో కూడిన రుణాలతో అవసరమైన వ్యాపార యూనిట్ ఏర్పాటుపై దృష్టి సారించి ఆర్థికాభివృద్ధి దిశగా ఆలోచన చేయాలని డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ పి.కిరణ్ కుమార్ తెలిపారు. సంకల్ప్ సప్తV్‌ా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఎపిఎం దొడ్ల భవానీ ఆధ్వర్యంలో స్థానిక వెలుగు కార్యాలయంలో సమృద్ధి దివాస్ మనోహరమైన జీవన వసరాలు పేరుతొ మహిళల ఆర్థిక అభివృద్ధి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎపిజివిబి పార్వతీపురం అడ్వాన్స్ మేనేజర్ సోమేశ్వరరావు మాట్లాడుతూ బ్యాంకులు వివిధ రకాల యూనిట్ల ఏర్పాటుకు అందిస్తున్న రుణాలు, ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం, సెక్యూరిటీతో కూడిన ఇన్సూరెన్స్ స్కీమైన పిఎంజెజెబివై, పిఎంఎస్‌బివై, ప్రాధాన్యత వున్న యూనిట్ ఏర్పాటు గురించి తెలిపారు. జిసిసి డిఎం సంధ్యారాణి జిసిసి కార్పొరేషన్ ద్వారా గిరిజన ఉత్పత్తులు కొనుగోలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల గురించి తెలిపారు. కార్యక్రమంలో ఎపిజివిబి బ్యాంకు మేనేజర్ సతీష్, ఇండిస్టియల్ ఎడి కిరణ్ కుమార్, ఎంపిడిఒ చంద్రరావు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.










