ప్రజాశక్తి - మంత్రాలయం
మహిళల ఆదరణే వైసిపి ప్రభుత్వానికి కొండంత అండ అని ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం పొదుపు సంఘాలకు వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ రుణాల విడుదలపై వైకెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చెప్పే మాయ మాటలకు మోసపోవద్దని సూచించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో, రాజకీయ రంగాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగనకే దక్కిందని తెలిపారు. నాలుగో విడత వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ రుణాల ద్వారా నియోజకవర్గంలో 5,094 గ్రూపుల్లో సుమారు 60 వేల మంది మహిళలకు రూ.527.13 కోట్ల లబ్ధి చేకూరుతోందని చెప్పారు. వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి, సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచి హోటల్ పరమేష్ స్వామి, మండల ఉపాధ్యక్షులు పులికుక్క రాఘవేంద్ర, ఎంపిటిసి జి.వెంకటేష్, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, కోసిగి మాజీ జడ్‌పిటిసి మంగమ్మ, నాయకులు జనార్ధన్ రెడ్డి, కౌతాళం నాయకులు ప్రహ్లాదచారి, ఎస్‌ఐ వేణు గోపాల్ రాజు పాల్గొన్నారు.
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి










