Jul 30,2023 22:00

కరపత్రాన్ని అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే బికె. పార్థసారధి

ప్రజాశక్తి రొద్దం : మహిళల సమగ్ర అభివృద్ధే చంద్రబాబు ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే బికె పార్థసారథి అన్నారు. మండలంని లోచర్ల గ్రామంలో నిర్వహించిన మహాశక్తి కార్యక్రమంలో పార్థసారధి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామంలో ఇంటింటికి తిరిగా భవిష్యత్తుకి గ్యారెంటీ పథకాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలొ పార్థసారథి సతీమణి కమలమ్మ, మహిళా అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, పార్లమెంట్‌ అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు, నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు చిన్నప్పయ్య, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయమ్మ, కన్వీనర్లు నరహరి, సిద్దయ్య, నేత్రవతి, లీలావతి, అనురాధ, నాగమణి, బేబీ, తులసి, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
హిందూపురం : టిడిపి అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మ్యానిఫెస్టో మహిళల అభ్యున్నతికి మహాశక్తి తోడ్పాటు అందిస్తుందని అన్నారు. మహాశక్తితో భవిష్యత్తుకి గ్యారెంటీ సూపర్‌ సిక్సర్‌ మినీ మేనిఫెస్టోను ఆదివారం పట్టణంలోని లక్ష్మిపురం,మోడాల్‌ కాలనీల్లో తెలుగు మహిళ ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు పెరిగిన నిత్యావసర ధరలు, పెట్రోల్‌, డిజల్‌, కరెంట్‌ బిల్లులు, గ్యాస్‌ ధరలు, ఇంటి పన్నులు పెంపు, ఆర్టీసీ చార్జీలు పెంపు, చెత్త పన్ను తదితర ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కార్యదర్శి పరిమళ, వార్డు కౌన్సిలర్‌ దుర్గా మంజుళ, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి వెంకటేష్‌, పార్లమెంట్‌ మహిళా కార్యదర్శి చెన్నమ్మ, పట్టణ మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, గాడ్రాలపల్లి లక్ష్మీదేవి, గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.