Aug 12,2023 21:17

eevaram nandayala

మహాధర్నా విజయవంతం
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి

    కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈ నెల 2న ఆదోనిలో ప్రారంభమైన సిపిఎం మహా పాదయాత్ర సోమవారం కర్నూలుకు చేరుకుంది. ఈ పాదయాత్ర బృందానికి పెద్ద ఎత్తున సిపిఎం శ్రేణులు, ఇతర సంఘాలు ఘనంగా స్వాగతం పలికాయి. ఆయా వర్గాల ప్రజలు తమ సమస్యలను సిపిఎం బృందానికి విన్నవించుకున్నారు. ఉదయం పెద్దపాడు సమీపంలోని తాజ్‌ ఫంక్షన్‌ హాల్‌ నుండి సిపిఎం మహా పాదయాత్ర బృందం బళ్లారి చౌరస్తాకు చేరుకుంది. సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి. రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి ప్రదర్శనకు అగ్రభాగాన కలెక్టరేట్‌ వరకు నడిచారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయితో పాటు కార్యదర్శివర్గ సభ్యులు పిఎస్‌.రాధాకృష్ణ, కెవి.నారాయణ, జి.రామకృష్ణ, వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులకు ఘనంగా పూలమాలలతో స్వాగతం పలికారు. బళ్లారి చౌరస్తా సమీపంలో ఎపి ఆటో ట్రాలీ డ్రైవర్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి కె. ప్రభాకర్‌ బృందంతో ఘనంగా స్వాగతం పలికారు. కొత్త బస్టాండ్‌ సమీపంలో కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ హమాలీ వర్కర్లు గజమాలతో స్వాగతం పలికారు. సుందరయ్య సర్కిల్లో సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి రాముడు, ఆటో డ్రైవర్స్‌ యూనియన్‌ న్యూ సిటీ కార్యదర్శి రాధాకష్ణ, ఐద్వా శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి పి.నిర్మల, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎన్‌.అలివేలు, నగర నాయకులు కిరణ్మయిలు హారతులు ఇచ్చి నుదుటిపై ఎర్రటి తిలకం దిద్ది పాదయాత్ర బృందాన్ని ఆహ్వానించారు. యుటిఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జయరాజు, జిల్లా కోశాధికారి హేమంత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో స్వాగతం పలికి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం పూలతో స్వాగతం పలికారు. బంగారు పేట సర్కిల్‌ వద్ద సిపిఐ నాయకులు సంఘీభావం తెలుపుతూ పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. మౌర్యా ఇన్‌ కూడలి, రాజ్‌ విహార్‌ మీదుగా కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు హాజరై మాట్లాడారు.
ప్రాజెక్టులకు వరద నీరు..
జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టులకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుండి శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతున్నాయి. ఎగువ కర్ణాటకలో కురిసిన వర్షానికి తుంగభద్ర జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది.
నకిలీ దందా..
నకిలీ పురుగు మందుల విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బయో పురుగు మందుల పేరుతో మార్కెట్లో వాటి విక్రయాలు సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆ దందా కోట్లల్లో సాగుతోంది. బయో కంపెనీల పేరుతో నకిలీ పురుగు మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సదరు కంపెనీలు విక్రయదారులకు ప్రోత్సాహకాలు ఇస్తూ తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌లో నంద్యాల జిల్లాలో దాదాపు రూ.1.5 కోట్ల మేర వాటి విక్రయాలు జరిగాయి.