Aug 08,2023 23:01

ప్రజాశక్తి-చల్లపల్లి : విజయవాడలో బుధవారం జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక బస్టాండ్‌ సెంటర్లో గురువారం సిఐటియు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం పార్టీ జిల్లా నాయకులు నాయకులు వాకా రామచంద్ర రావుమాట్లాడుతూ మోడీ విధానాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు, బిజెపి ప్రభుత్వం కార్మికులు సాధించుకున్న 44 చట్టాలు రద్దుచేసి, నాలుగు లేబర్‌ కోడ్‌ లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పుకొట్టాలని అన్నారు. రైతు లకు గిట్టుబాటు ధరలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు విశాఖ ప్రైవేటీకరణ ఆపే వరకు పోరాటం చేయాలని ప్రజల హెచ్చరించారు. బిజెపి మతోన్మాద విధానాన్ని తిప్పి కొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తొమ్మిది సంవత్సరాల మోడీ పరిపాలనలో కార్మిక కోర్కెలు ఏవి పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కీం వర్కర్లకు కనీస వేతనం 26 వేలు పెంచా పెంచాలని కోర్కెను పెడచెవిన పెట్టారని విమర్శించారు. అసంఘటిత కార్మికులందరికీ పిఎఫ్‌ పెన్షన్‌ ఆరోగ్య సౌకర్యాలు కల్పించాలని ,కాంట్రాక్ట్‌ వర్కర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కొత్త పెన్షన్‌ పద్ధతిని రద్దుచేసి పాత పెన్షన్‌ స్కీము పునరుద్దించాలని, కనీస ఈపీఎస్‌ పెన్షన్‌ తొమ్మిది వేలకు పెంచాలనిప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మోపిదేవి కార్యదర్శి సిరివెళ్ల రాజశేఖర్‌ చల్లపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్‌ గంగాభవాని మహమ్మద్‌ కరిముల్లా అంగన్వాడీ కార్యకర్తలు షేక్‌ ముంతాజ్‌ బేగం, షేక్‌ పంత్‌ ఆశ వర్కర్‌ రమ్య,ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు గట్ల శ్రీను, ఉమామహేశ్వర రావు రిక్షా కార్మికులు కార్మికులు సావార్య, టాక్సీ వర్కర్స్‌ నంద్యాల రాధాకష్ణ షేక్‌ సుభాని తదితరులు పాల్గొన్నారు.