Jul 31,2023 20:42

సమావేశంలో మాట్లాడుతున్న షాకీర్‌

ప్రజాశక్తి-ఆలూరు
జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ఈనెల 2 నుంచి 7 వరకు ఆదోని నుంచి కర్నూలు వరకు వందలాది మందితో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా పాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి షాకీర్‌ కోరారు. సోమవారం జ్యోతిబసు భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలూరు నియోజకవర్గం కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమని తెలిపారు. వేదవతి, నగరడోన రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయితే రైతులకు సాగు, తాగునీరు అందించవచ్చని చెప్పారు. జింకల నుంచి పంటలను రక్షించడానికి జింకల పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమస్యలపై ఏళ్ల తరబడి వామపక్షాలు, ప్రజాసంఘాలు, రైతులు, ప్రజలు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వాలు కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. సిపిఎం తాలూకా నాయకులు కెపి.నారాయణ స్వామి, ఈరన్న, మైనా పాల్గొన్నారు.