Jul 15,2023 20:40

మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు ప్రభాకర్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
మహాపాదయాత్రను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి కోరారు. ఈనెల 26 నుంచి 31 వరకు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఆదోని నుంచి కర్నూలు వరకు చేపట్టే మహాపాదయాత్రకు మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరిగింది. సంఘీభావం తెలుపుతున్నట్లు పార్టీలు, ప్రజాసంఘాలు పేర్కొన్నాయి. శనివారం పట్టణంలోని ఎన్‌జిఒస్‌ హోమ్‌లో పట్టణ కార్యదర్శి లక్ష్మన్న అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి అతిరథ మహారథులు, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఇలా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించినా జిల్లాకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. జిల్లాలో సాగునీరు, పారిశ్రామిక రంగం, విద్యలో, వెనుకబాటుకు గురైందన్నారు. సహజ వనరులు ఎన్ని ఉన్నా, పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో అట్టడుగున ఉందని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యం, ఆదోని ప్రాంతం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభివృద్ధి చేయాలనే తపన లేకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదని మండిపడ్డారు. కర్నూలు జిల్లా సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా ఉంటామని తెలిపారు. ఆర్‌సిసి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజరు బాబు, కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జీ దేవిశెట్టి ప్రకాష్‌, నీలకంఠప్ప, సిపిఐ ఎంఎల్‌ (న్యూ డెమోక్రసీ) జిల్లా నాయకులు మల్లికార్జున, ఆర్యవైశ్య మాజీ అధ్యక్షులు ఎన్‌ఆర్‌ఐ నాగేష్‌ కాకుబల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇన్‌ఛార్జీ నాగరాజు, టిడిపి నాయకులు మల్లికార్జున, బీఎస్పీ నాయకులు రామలింగ, హోమియోపతి వైద్యులు సోమశేఖర్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు షాబిర్‌ బాష, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి నాగరాజు, పిడిఎస్‌ఒ నాయకులు తిరుమలేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, బిడిఎస్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు రమేష్‌, పిడిఎస్‌యు డివిజన్‌ కార్యదర్శి అఖండ, డిఎస్‌ఎఫ్‌ కార్యదర్శి ఉదరు, జై భీమ్‌ యూత్‌ నాయకులు కుమార్‌, పిఒడబ్ల్యు మహిళా నాయకులు మణెమ్మ, లలిత కళా సమితి నాయకులు శంకర్‌ రావు, సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు సుదర్శన్‌, రాజు, సిపిఎం జిల్లా నాయకులు రాధాకృష్ణ, వెంకటేశులు, మండల కార్యదర్శి లింగన్న, సిఐటియు పట్టణ, మండల నాయకులు తిప్పన్న, వీరారెడ్డి, వ్యకాస నాయకులు రామాంజినేయులు, కెవిపిఎస్‌ నాయకులు నాగేంద్ర పాల్గొన్నారు.

రౌండ్‌టేబుల్‌ సమావేశానికి హాజరైన నాయకులు