ప్రజాశక్తి - వీరఘట్టం : గ్రామాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కల్పనా కుమారి అన్నారు. మండలంలోని తలవరంలో బుధవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలకు ప్రజలు వచ్చి తనిఖీలు నిర్వహించి మెరుగైన వైద్యం పొందాలని ప్రజలను కోరారు. అనంతరం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎస్ మధుసూదనరావు, తహశీల్దారు సిహెచ్ సత్యనారాయణ, వైద్యాధికారులు ఎ.మానస, పి.ఉమామహేశ్వరి, వెంకటరమణ, సచివాలయ కార్యదర్శి నారాయణరావు, వైద్య, సచివాలయ సిబ్బందితో పాటు గ్రామ వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే వీరఘట్టంలోని శైల రామారావు పేట, ఊజుల, మర్రి, శైల తదితర వీధుల్లో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది రక్తపోటు మధుమేహ తదితరమైన వ్యాధిగ్రస్తులకు తనిఖీలు నిర్వహించి వారి పేర్లను నమోదు చేశారు. కార్యక్రమంలో ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
పాలకొండ :మండలంలోని గొట్టమంగళాపురంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ కల్పనా కుమారి పాల్గొన్నారు. వైద్యశిబిరానికి హాజరైన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలను అడిగారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి : మండలంలోని తోటపల్లిలో జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ మరిచర్ల బాపూజీనాయుడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాలను పరిశీలించి వైద్య సమయం నిమిత్తం వచ్చే పలువురి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాపూజీనాయుడు మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తలపెట్టారన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ కెకె సాగర్ వర్మ, వైద్య సేవలుఅందించారు. కార్యక్రమంలో విశాఖ కెజిహెచ్ వైద్యులు ఎఎస్ దివ్య, జనరల్ మెడిసిన్, డాక్టర్ డి.పార్థిబన్, ఎంపిడిఒ జి.పైడితల్లి, ఇఒపిఆర్‌డి గోపాలకృష్ణ, ఎఒ ఎన్.అర్జున్‌రావు, సర్పంచ్ ఆవాల సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్ : మండలంలోని బందలుప్పి పిహెచ్‌సి పరిధిలోని జమదాలలో జరుగుతున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శిబిరాన్ని ఎంపిపి మజ్జి శోభారాణి సందర్శించి రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును గమనించారు. ఈ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ శివనారాయణ, స్థానిక సర్పంచ్ రెడ్డి భారతి, ఎంపిటిసి శ్రీనివాసరావు, వైస్ ఎంపిపి బంకురు రవికుమార్, వైసిపి మండల అధ్యక్షులు బొమ్మి రమేష్, నాయకులు బంకపల్లి రామకృష్ణ, ప్రభుత్వ వైద్యాధికారులు, వైద్యులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పాచిపెంట : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి బి.ప్రమీల కోరారు. మండలంలోని పద్మాపురంలో వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 512 మందికి వైద్య సేవలందించి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో గొట్టాపు ముత్యాల నాయుడు, పి.వీరమనాయుడు, రవీంద్రనాథ్, దండి ఏడుకొండలు, బి.వీరయ్య, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ శివకుమార్, ఎంపిడిఒ లక్ష్మీకాంత్, వైద్యాధికారులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని గుచ్చిమి గ్రామ సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ బి.జగన్నాధరావు, మండల ప్రత్యేక అధికారి కె.రామచంద్రరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. కావున సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్య అధికారులు శిరీష, ఉషారాణి, రమాకాంత్, అపర్ణ, సర్పంచ్ ఎం.శ్రీదేవి, ఎంపిటిసి సభ్యులు జగదీష్, జెడ్‌పిటిసి సభ్యులు ఎం.బాబ్జీ, ఎంపిపి ప్రతినిధి బి.శ్రీరాములు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.










