సురక్ష నిర్వహిస్తున్న అధికారులు
ప్రజాశక్తి - హాలహర్వి
పేదలకు మెరుగైన వైద్యం అందిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం 'జగనన్న ఆరోగ్య సురక్ష' నిర్వహిస్తోందని ఎంపిడిఒ ఆంథోని తెలిపారు. శనివారం నిట్రవట్టి ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' క్యాంపులను జడ్‌పిటిసి లింగప్ప, సర్పంచి గాదిలింగప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 'సురక్ష' ద్వారా ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ 'జగనన్న ఆరోగ్య సురక్ష' క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐసిడిఎస్ చందన, ఈరన్న, మన్సూర్ వలీ, తిమ్మన్న, గంగాధర్, గైనకాలజిస్ట్ మెహరున్నీసా పాల్గొన్నారు.










