ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే 'జగనన్న సురక్ష' లక్ష్యమని వైసిపి సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని 30, 31, 32, 33వ వార్డులకు సంబంధించిన లబ్ధిదారులకు ధ్రువపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనన, మరణ, వివాహ, కుల, ఆదాయ, స్థానిక సర్టిఫికెట్లతో పాటు భూములు, ప్లాట్లు, ఇల్లు రిజిస్ట్రేషన్ సౌకర్యాలు సచివాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ రఘు, వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, కమిషనర్ గంగిరెడ్డి, టౌన్ బ్యాంక్ ఛైర్మన్ కొమ్ము రాజశేఖర్, కౌన్సిలర్ బోయ బజారి, వైసిపి నాయకులు బుట్టా రంగయ్య, పాల శ్రీనివాస రెడ్డి, కోటకొండ నరసింహులు, విశ్వనాథ్, వడ్డే వీరేష్ పాల్గొన్నారు.
ధ్రువపత్రాలను పంపిణీ చేస్తున్న నాయకులు










