May 25,2023 22:31

mechineni ramarao

మేచినేని బాబుకు పితృవియోగం
ప్రజాశక్తి-గన్నవరం
వైసిపి జిల్లా నాయకుడు, ముస్తాబాదకు చెందిన ప్రముఖ టుబాకో వ్యాపారి మేచినేని వెంకట శివ సత్యనారాయణకు పితృవియోగం కల్గింది. గురువారం బాబు తండ్రి మేచినేని రామారావు (95) విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. భౌతిక కాయాన్ని ముస్తాబాదలోని స్వగృహానికి తీసుకొచ్చారు. గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీ మోహన్‌ గ్రామానికి వెళ్లి రామారావు భౌతికకాయంపై పూలమాలవేసి నివాళులర్పించారు. గన్నవరం ఎంపీపీ అనగాని రవి, మాజీ వైస్‌ ఎంపీపీ గొంది పరంధామయ్య, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య, కాపు ఐక్య సమ్మేళనం గన్నవరం నియోజకవర్గ ఉపాధ్యక్షులు గోపిశెట్టి వీరస్వామి, వంశీ యూత్‌ నాయకులు ఓలుపల్లి మోహనరంగా, ముస్తాబాద గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు రామారావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామారావుకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మేచినేని బాబు వంశీ అనుచరుడుగా ఉంటూ వైసిపిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గ్రామంలోని స్మశాన వాటికలో రామారావు భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి.