కార్మికులతో మాట్లాడుతున్న నాయకులు
హిందూపురం : మే 1 అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో చేపట్టే ర్యాలీ, బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గోని విజయవంతం చేయాలని సిఐటియు పట్టణ నాయకులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం పట్టణంలోని పౌరసరఫరాల శాఖ గౌడన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, మే డేను జయప్రదం చేయాలని కోరారు. అదే విధంగా మే డే విశిష్టత, కేంద్ర, రాష్ట్ర ప్రభుఆ్వలు కార్మిక చట్టాలను మార్చి, పారిశ్రామిక వేత్తలకు కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తున్న విధానాలను వివరించారు. ఈ నేపథ్యంలో మే 1న ఉదయం 10 గంటలకు ఆర్ అండ్ బి బంగ్లా నుండి జరిగే కార్మిక ప్రదర్శన, బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు.










