ప్రజాశక్తి - గుడివాడ : స్నేహితుడిని హత్య చేసిన సంఘటన గుడివాడ రూరల్ మండలం బొమ్ములూరు గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గుడివాడ రూరల్ మండలంలో బొమ్ములూరు గ్రామంలో నివాసం ఉంటున్న గుత్తా సురేష్ (38) అతని స్నేహితులు కలిసి గ్రామంలో మద్యం సేవిస్తుండగా సురేష్ కి అతని స్నేహితుడు చక్రికి మధ్య మాట మాట పెరిగి సురేష్ ని చక్రి మందు సీసా పగలగొట్టి గొంతులో పొడిచి హత్య చేశాడు. ఈ హఠాత్పరిణామంతో అక్కడ ఉన్న మిగిలిన మిత్రులు పారిపోగా సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో గ్రామస్తులు గుడివాడ తాలూకా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.










