Apr 20,2023 22:20

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి

అగళి : మండలంలోని ఇరిగేపల్లి పంచాయతీలో 1997లో నిర్మించబడిన మైరాడ కార్యాలయాన్ని పంచాయతీకి అప్పగించారు. ఇరిగేపల్లి పంచాయతీలో అప్పటి డైరెక్టర్‌ ఫెర్రెండేస్‌ సుమారు 70 సెంట్లు భూమిని అగళి బసవే గౌడ్‌ మైరాడ సంస్థ కు దానంగా ఇచ్చారు. ఆ 70 సెంట్లు భూమిలో సుమారు రెండు కోట్ల రూపాయల విలువ చేసే భవనాలు నిర్మించారు. మైరాడ సంస్థ మరోచోటుకు మార్చడంతో ఇక్కడున్న భవనం మూడేళ్లుగా మూత పడింది. ఖాళీగా ఉన్న ఈ భవనం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి మైరాడ ప్లాన్‌ సంస్థ సంస్థాపకులు ఫెర్నాండిస్‌ తో మాట్లాడి ఖాళీగా ఉన్న భవనాన్ని పంచాయతీకి ఉపయోగకరంగా ఉంటుందని ఆ భవనాన్ని పంచాయతీకి అప్పగించాలని సూచించారు. దీంతో గురువారం మైనాడ సంస్థాపకుడు ఆధ్వర్యంలోనే పంచాయతీ సర్పంచ్‌ లక్ష్మమ్మకు ఈ భవనాన్ని అప్పగించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి లక్ష్మమ్మ, మాజీ మంత్రి రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.