Aug 29,2023 19:55

గిడుగు జయంతి వేడుకలో అధ్యాపకులు, విద్యార్థులు

ప్రజాశక్తి-ఆలూరు
తల్లి లాంటి తెలుగు భాషను మరచిన వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనని ఆలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ కె.జ్ఞానేశ్వర్‌ తెలిపారు. మంగళవారం కళాశాలలో తెలుగు అధ్యాపకులు డాక్టర్‌ బి.రాఘవేంద్ర ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి 160వ జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం నిర్వహించారు. రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ జ్ఞానేశ్వర్‌ మాట్లాడారు. తెలుగు భాష లిపి కలిగిన భాష అని తెలిపారు. పంతులుగా విధులు నిర్వహించే గిడుగు రామ్మూర్తి గ్రాంధిక భాషలో ఉన్న పదాలను ప్రజల వాడుక భాషలోకి తీసుకొచ్చారని కొనియాడారు. అనంతరం వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.మాధవి, అధ్యాపకులు చిరంజీవి, సుశీల, రాఘవేంద్ర, ముద్దప్ప, సిబ్బంది శేఖర్‌, ప్రణరు, విద్యార్థులు పాల్గొన్నారు.