ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్ : సత్య సాయి జిల్లాలో జరుగుతున్న మాతా శిశు మరణాల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తతో ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్వీ కృష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో మాతా శిశు మరణాల పై మంగళవారం సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ మాట్లాడుతూ మాతృ మారణాలు రామగిరి ధర్మవరం మండలంలో ఒకటి చొప్పున, శిశుమరణాలు, సోమందేపల్లి మండలంలో -2 గాండ్ల పెంట మండలంలో - 2, ధర్మవరం మండలంలో - 1, రామగిరి మండలంలో - 1, బత్తల పల్లి - 1 మొత్తం 7 శిశు మరణాలు 2 మాత మరణాలు సంభవించాయన్నారు. ఈకేసులకి సంబంధించి వాటి లోపాలను వెతికి సరిచేసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఐఒ డాక్టర్ కృష్ణయ్య, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ తిప్పేంద్ర నాయక్, డాక్టర్ సెల్వియా, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ నజీర్ తదితరులు పాల్గొన్నారు.










