సుమారు ఇరవై ఏళ్ల క్రితం ఇంట్లో టీవీ ఉందంటే ఆశ్చర్యపోయేవారు.. ఇప్పుడు టీవీ లేకపోతేనే ఆశ్చర్యపోతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక టెక్నాలతో పలు రకాల సైజులలో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు టీవీలు కొనేందుకు ధరలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. ఇప్పుడే అందరికీ అందుబాటులో ఉండే ధరలతో స్మార్ట్, అండ్రాయిడ్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి.
వాయిస్ ఇస్తే చాలు.. నచ్చిన ప్రోగ్రాం..
ఒకప్పుడు టీవీలలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. కేవలం వాటిల్లో వచ్చే కార్యక్రమాలను మాత్రమే వీక్షించేవారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయి నేటి టీవీలలో ఎన్నో ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. రిమోట్ బటన్‌ను నొక్కిపట్టి మనకు కావాల్సిన ప్రోగ్రాం చెబితే చాలు అది టీవీ తెరపై కనిపిస్తుంది. అంతేకాకుండా అమెజాన్, నెట్ ప్లిక్స్, యూట్యూబ్, ఆహా, హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ వంటి ఎన్నో రకాలుగా ప్రోగ్రామ్‌లు చూడవచ్చు. ప్రతి నిత్యం పలు ఛానెళ్లలో వచ్చే సీరియల్స్ కూడా ఇష్టమొచ్చిన సమయంలో చూసే అవకాశం కూడా ఇప్పుడు ఉంది.
స్మార్ట్ టీవీలు..
మారిన పరిస్థితులలో మార్కోట్లో స్మార్ట్ టీవీలు ప్రాచుర్యం పొందాయి. ధరలు కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ టీవీ వాటి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. స్మార్ట్ టీవీలు వెబ్ ఓఎస్, టిజెన్ హోమ్ ఓఎస్ లేదా కొన్ని కస్టమ్ లూనిక్స్ ఆధారిత ఓఎస్‌లతో రన్ అవుతాయి. ఈ స్మార్ట్ టీవీలను వేరుచేసేది కేవలం అన్ని రకాల యాప్ లభ్యత కాగా స్మార్ట్ టీవీలలో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమె జాన్ ప్రైమ్ వీడియో వంటి మరిన్ని ప్రసిద్ధ యాప్‌లు అందించే కార్యక్రమాలు వీక్షించవచ్చు. ఓటీటీ యాప్‌లు, వాటి సభ్యత్వంతో కావలసినప్పుడు ఇష్టమైన టీవీ షోలు మూవీలను చూసే అవకాశం ఉంది. వాస్తవానికి స్మార్ట్ టీవీలలో ఎటువంటి సమస్యలు లేకుండా కంటెంట్‌ను ప్రసారం చేయగలగడానికి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం అవుతుంది.
ఆండ్రాయిడ్ టీవీలు
ఆండ్రాయిడ్ టీవీలు కూడా స్మార్ట్ టీవీ లాగే ఉంటా యి కానీ చిన్న తేడా ఏమిటంటే ఇవి ఆండ్రాయిడ్ ఓఎస్‌తో రన్ అవుతాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ లో టీవీ రన్ అయేటప్పుడు చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆండ్రాయిడ్ ఓఎస్ ద్వారా గూగుల్ అసిస్టెంట్‌కు యాక్సిస్ పొందవచ్చు. అంటే ఆండ్రా యిడ్ టీవీలను కంప్యూటర్ మాదిరిగా కూడా ఉపయోగించవచ్చు. ఇందులో ఛానెల్‌లను మార్చడం, వాల్యూమ్ పెంచడం లేదా తగ్గించడం వంటి ఫంక్షన్ల కోసం వాయిస్ ఆదేశాలను ఇవ్వవచ్చు. దీని ద్వారా వాతావరణ సమాచారం, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు, జోక్స్ వంటివి మరెన్నో తెల్సుకోవచ్చు. అండ్రాయిడ్ టీవీలో ఉన్న ప్లే స్టోర్ నుంచి అన్ని రకాల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా యాక్సిస్ పొందవచ్చు. వీటిలో ప్లే మూవీస్, ప్లే మ్యూజిక్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యూ ట్యూబ్, స్పాటిఫై, ట్విట్టర్ వంటి యాప్స్ ఉన్నాయి.










