Sep 14,2023 20:59

మధ్యలో ఆగిపోయిన గుంతకల్లు డిపో బస్సు

ప్రజాశక్తి - చిప్పగిరి
గుంతకల్‌ డిపోకు చెందిన బస్సులు రోజూ గుంతకల్‌ నుంచి ఆదోనికి వెళ్లే రహదారుల్లో ఎక్కడ పడితే అక్కడ చెడిపోయి ఆగిపోవడంతో ప్రయాణకులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురువారం అమావాస్య నేపథ్యంలో చాలామంది పలు దేవాలయాలు, ఉరుకుందు ఈరన్న స్వామికి వెళ్లే భక్తులు ఎక్కువ ఉంటారు. ఉరుకుంద ఈరన్న స్వామికి వెళ్లే వారందరూ గుంతకల్‌ నుంచి ఆదోనికి వెళ్లే బస్సులో ప్రయాణిస్తున్నారు. అంతలో కుందనగుర్తి గ్రామ స్టేజ్‌ సమీపంలో బస్సు చెడిపోవడంతో నిలిచిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కండక్టర్‌, డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా కిందికి దిగి రోడ్డు ఇరువైపులా పిల్లాపాపలతో కూర్చున్నారు. అమావాస్య నేపథ్యంలో దేవాలయాలకు వెళ్లే వారు ఎక్కువ బస్సుల్లో ప్రయాణిస్తుంటారని, కండిషన్‌లో ఉన్న బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.