ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
పట్టణంలో వినాయక నిమజ్జనంలో భాగంగా దారి వెంట వెళ్లే భక్తులకు మల్లెల గ్రూప్స్ అధినేత డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు బిస్కెట్లు, నీళ్లు, మజ్జిగ, రస్నా ప్యాకెట్లు అందించి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సీతారామయ్య మాట్లాడారు. ఎమ్మిగనూరు ప్రాంతంలో ఇలాంటి మానవత్వం కలిగిన మనుషులు ఉండడం వల్ల, ఈ ప్రాంతం ప్రశాంతతకు నిదర్శనంగా ఉందని తెలిపారు. డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు 'మన మతం, మన తత్వం మానవత్వం' అనే నినాదంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆకాంక్షించారు. వినాయక కేంద్ర మండలి సభ్యులు కూడా ఆల్ఫ్రెడ్ రాజు సేవలను అభినందించారు. ముస్లింలు ఇస్మాయిల్, ఎంపిజె రాష్ట్ర నాయకులు ఎల్‌ఎమ్‌డి.ఖాదర్, ప్రజాసంఘాల నాయకులు వసుంధర, పరశురామ్, అజిత్, మల్లికార్జున, మల్లెల గ్రూప్ సభ్యులు సతీష్, సామ్యేలు, జోసెఫ్, గోవిందు పాల్గొన్నారు.
భక్తులకు బిస్కెట్లు, నీళ్లు, మజ్జిగ, రస్నా అందిస్తున్న ఆల్ఫ్రెడ్ రాజు










