Oct 28,2023 00:12

మా వారు 'నిర్దోషి'

మా వారు 'నిర్దోషి'
రుజువుల్లేక ఢలాీ పడ్డ జగన్‌ సర్కార్‌
'2024' టీడీపీ- జనసేన కూటమిదే
'నిజం గెలవాలి' సభలో నారా భువనేశ్వరి
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
మా వారు నిర్దోషి..అక్రమ కేసులో 50 రోజుల్లో జైల్లో పెట్టించిన జగన్‌ సర్కార్‌ నేరాన్ని రుజువు చేయలేక ఢలాీ పడిందంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. 2024 ఎన్నికల్లో టిడిపి - జనసేన అఖండ విజయాన్ని సాధించి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటూ జోష్యం చెప్పారు. 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. ఈ ప్రభుత్వం చంద్రబాబును జైల్లో నిర్బంధించింది..! కానీ ఒక్కటి మాత్రం మరచిపోతున్నారు..! నిర్బంధించింది ఆయన్ను కాదు.. రాష్ట్రాన్ని, న్యాయాన్ని అన్నారు. అందుకే రాష్ట్రం కోసం, మన కోసం, మనబిడ్డల కోసం, భావితరాల కోసం' పోరాడదామని భువనేశ్వరి పిలుపునిచ్చారు. 'నిజం గెలవాలి'.. నిజమే గెలవాలని నినదించారు. ఇక్కడికి రాజకీయాలు మాట్లాడేందుకు రాలేదన్నారు. నిజం గెలవాలని చెప్పేందుకే వచ్చానన్నారు.
ప్రజలే దేవుళ్లన్న ఎన్టీఆర్‌ స్ఫూర్తితో చంద్రబాబు ఎన్టీఆర్‌ ట్రస్టు..
నెలకొల్పి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. చంద్రబాబు గురించి నా కంటే మీకే బాగా తెలుసన్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితమంతా ప్రజలు- రాష్ట్ర అభివద్ధి అన్నట్లు సాగిందన్నారు. పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి, లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించి వారి కుటుంబాల్లో సంతోషం నింపిన మహా మనిషి చంద్రబాబు అంటూ కొనియాడారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిగా తేవడం, పోలవరం కట్టించడం, రాయలసీమకు కియాపరిశ్రమ తేవడం, నిరుద్యోగులకు స్కిల్‌ డెవలప్మెంట్‌ యూనివర్సిటీలు స్థాపించడం, మహిళలకు పసుపు కుంకుమ ఇవ్వడం, తల్లీబిడ్డ ప్రారంభించడం, పేదలకు మూడు పూటలా పట్టడన్నం పెట్టేందుకు అన్న క్యాంటీన్లు నెలకొల్పడం చంద్రబాబు చేసిన తప్పా అని ప్రశ్నించారు. చంద్రబాబు అంటే అభివద్ధి- అభివద్ధి అంటే చంద్రబాబు అన్న స్థితి నుంచి జగన్‌ పాలనలో ఏపీ అంటే అవినీతి, ఏపీ అంటే మహిళలపై దాడులు, ప్రశ్నిస్తే కేసులు, పెరిగిన కరెంటు బిల్లులు, నిత్యావసర ధరలు స్థాయికి దిగజారి పోయిందంటూ వాపోయారు. అహర్నిశలు రాష్ట్ర అభివద్ధి కోసం పాటుపడ్డ చంద్రబాబును జైల్లో పెట్టడం చాలా బాధాకరం' అంటూ భువనేశ్వరి భావోద్వేగానిక ిలోనయ్యారు. జగన్‌ ప్రభుత్వానికి చంపడం, కేసులు పెట్టి వేధించడమే తప్ప రాష్ట్రాన్ని అభివద్ధి చేయాలని, యువతకు ఉద్యోగాలు తీసుకురావాలనే ఆలోచన లేదని విమర్శించారు. జగన్‌ సర్కార్‌ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారంటూ కితాబిచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి జనసేన కూటమి విజయం తధ్యమనీ, వైసిపికి ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. మాజీ మంత్రి పనబాక లక్ష్మి, అమర్నాథరెడ్డి, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీలు అనురాధ రాంగోపాల్‌ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్‌, పులివర్తి నాని, నరసింహ యాదవ్‌, బొజ్జల సుధీర్‌ రెడ్డి, ఎస్సీవి నాయుడు, నరసింహ యాదవ్‌, జనసేన నాయకులు హరి ప్రసాద్‌, కోట వినుత తదితరులు పాల్గొన్నారు.