Apr 19,2023 22:44

gannavarm lo

'మా నమ్మకం నువ్వే జగన్‌' కార్యక్రమం

గుడివాడ : స్థానిక 5వ వార్డులోని జగనన్నే మా నమ్మకం మా భవిష్యత్తు కార్యక్రమం సందర్భంగా వార్డు కన్వీనర్‌ వెంపల అప్పారావు, జోగా నాగేశ్వరరావు, ఆర్జా ప్రసాద్‌ అధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐదో వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. హనుమాన్‌ జంక్షన్‌( గన్నవరం) : బాపులపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని 7వ వార్డులో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని రాష్ట్ర నాటక రంగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నక్కా గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచ్‌ సరిపల్లి కమల బారు,ఎంపీపీ యరగోర్ల నగేష్‌, జెడ్పీటీసీ కోమరవల్లి గంగ భవాని,జిల్లా క్రిస్టియన్‌ మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి కొమరవల్లి కిరణ్‌ మూర్తి,వార్డు సభ్యులు చందు కనక దుర్గ మల్లీశ్వరి, గృహ సారధుల కన్వీనర్‌ తిమోతి, కోమరవల్లి థామస్‌, గృహ సారథులు చందు నరేంద్ర, నాగరాజు, ఇస్మాయిల్‌, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటిని సందర్శించి మానమ్మకం నువ్వే జగనన్న స్టిక్కర్‌ అతికించి మొబైల్‌కు స్మాల్‌ స్టిక్కర్‌ ను వేయించి, వారి మొబైల్‌ నుండి మిస్డ్‌ కాల్‌ ఇచ్చి జగనన్న పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి పార్టీ ఇచ్చిన 5 ప్రశ్నలకు జవాబులు అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం : చిక్కవరం గ్రామం, చింతగుంట, కొత్త దళితవాడ, పాత దళితవాడల్లో గ్రామ సర్పంచ్‌ అన్నే లక్ష్మణ్‌రావు ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ అన్నే లక్ష్మణ్‌రావు, ఎంపీటీసీ దుర్గాదేవి, గ్రామ కన్వీనర్‌ సిహెచ్‌ జోజి, సచివాలయ కన్వీనర్‌ పి. రవమ్మా, గృహ సారథులు, వాలంటీర్లు పాల్గొన్నారు.