Oct 02,2023 12:14
  • వ్యవసాయ బోరులో నీటిమట్టం అడగండి పోతుంది

ప్రజాశక్తి-బొమ్మనహల్ : మండలంలోని 20 గ్రామాల నందు పదివేల మంది రైతులు వేదవతిలో బోరుబావులు వేసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామాల నందు గల కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభాల కోసం వేదవతి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో లోడు చేసుకుని అమ్ముకొని సలాబాలు పొందుతున్నారు. వారిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయినందున అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వలన వేలాదిమంది రైతులు లక్షలాది రూపాయలు అప్పు చేసి వారపుస్తున్న సైతం బ్యాంకులో కుదువ పెట్టి అప్పు చేసి పంట పొలాలు సాగు చేస్తున్నారు అలాంటి రైతులకు బోరుబావుల్లో సకాలంలో నీరందకపోతే రైతు కన్నీరు మున్నీరైనా కూడా ఇసుక స్వార్ధపరులు ఆగడాలు ఆగడం లేదని వారిని అరికట్టడానికి సబ్ మరియు పోలీసులు ప్రయత్నాలు విఫలమై రైతుకు కన్నీరే మిగిలింది సాగునీరు కోసం ప్రయత్నించిన ప్రతి రైతు కన్నీరు మిగిల్చుకుని అప్పుల పాలవుతుంటే ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవడంలోని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు పేకాట ఆడితే తప్పు మటక ఆడితే తప్పు అక్రమ ఇసుక తోలితే తప్పు రైతుకు సాగునీరు అందించక భూగర్భ జలాలను నీరుగారుస్తున్న వారు అక్రమ ఇసుక తరలిస్తున్న ప్రజా ప్రతినిధులు మరియు వ్యాపారులు చేసేది తప్పు కాదా బొల్లనగుడ్డం గోవిందవాడ కళ్ళు హోలా సిద్ధరాంపురం కురువల్లి బండూరు ఉద్దేహళ్ కొలగా నల్లి లింగదహాల్ కొత్తూరు కానాపురం గ్రామాల నందు వేదావతి నది ఒడ్డున గల రైతులు సాగునీటి కోసం  వేసిన బోరు బావుల్లో నీటిమట్టం తగ్గిపోయి పంటలకు అందకపోవడం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు పలుమార్లు ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు.