Oct 19,2023 08:20
  •  అలిపిరి ఘటనలో అధికారుల నిర్ధారణ

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన తిరుమల అలిపిరిలో చిన్నారిపై చిరుత దాడి ఘటనలో విస్మయ పరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటన అనంతరం అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోన్లలో చిక్కిన ఆరు చిరుతలలో మూడింటికి అసలు పళ్లులేవని తేలింది. దీంతో అధికారులే ఆశ్చర్యపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చిన్నారిపై మగ చిరుత దాడి చేసిందని నిర్ధారించారు. అయితే, దొరికిన వాటిలో చంపిన చిరుత ఉందా లేదా అన్నది ఇంకా తేలలేదు. డిఎస్‌ఎ పరీక్షా ఫలితాలు ఇంకా రాకపోవడమే దీనికి కారణం. బాలికను చిరుత చంపిన తరువాత ఇప్పటివరకు ఆరు చిరుతలను అటవీశాఖ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. వాటి వివరాలను కేంద్ర అటవీ శాఖకు పంపించారు. అరదులో రెండు చిరుతలను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఒకదానిని తిరుమల అటవీ ప్రాంతంలోనే విడిచిపెట్టగా, ఇరకొకదానిని ఎన్‌ఎస్‌టిఆర్‌ (నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వ్‌) అటవీ ప్రారతంలో విడిచిపెట్టారు. మిగిలిన నాలుగు చిరుతల్లో మూడు చిరుతలకు దంతాలు లేవని అధికారుల పరీక్షల్లో తేలిరది. సాధారణంగా చిరుత, ఇతర పులిజాతి మృగాలకు నాలుగు దంతాలు ఉంటాయి. అయితే పట్టుకున్న చిరుతల్లో ఒకదానికి నాలుగు దంతాలూ లేవని, మరో రెండు చిరుతలకు రెండేసి దంతాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

  • ఎలా జీవించేవో...

దంతాలు లేని పులులు వేట సాగించలేవని అటవీ అధికారులు చెబుతున్నారు. బలమైన కాలి గోర్లు ఉన్నప్పటికీ, అవి ఇతర జంతువులను గట్టిగా పట్టుకునేందుకే ఉపయోగబడతాయే తప్ప చంపాలంటే దంతాలు తప్పనిసరి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ చిరుతలు ఎలా బతికిబట్టగట్టగలిగాయన్నది ఆశ్చర్యకరమేనని అటవీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆ మూడు చిరుతలు బాలికను చంపే అవకాశాలు లేవని భావిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు. దంతాలు లేని చిరుతలను తిరిగి అడవుల్లో విడిచిపెడితే వాటి ఆహార అవకాశాలు లేకుండాపోతాయని, అందువల్ల అవి బతికున్నంతకాలం జూల్లోనే ఉంచాలని నిర్ణయించారు. ఒకదానిని విశాఖ జూకు తరలించగా, మిగిలిన రెరడు చిరుతలను తిరుపతి జూలోనే ఉరచినట్లు ఒక అధికారి వెల్లడించారు.