ప్రజాశక్తి-ఏలూరు : పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ట్రూ అప్ సర్దుబాటు, సర్ చార్జీ, అదనపు చార్జీలు పేరుతో ప్రజలపై భారాలు వేయటాన్ని వ్యతిరేకిస్తూ, ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.










