Jun 30,2023 16:03

ప్రజాశక్తి-చల్లపల్లి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన విద్యుత్ విధానాలతో ప్రజలపై మోయలేని భారం పడిందని వామపక్ష నేతలు ఆరోపించారు. శుక్రవారం స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి, సిపిఐ జిల్లా ఉపాధ్యక్షులు యద్దనపూడి మధు, అడ్డాడ ప్రసాద్ లు మాట్లాడుతూ టు ఆఫ్ సర్దుబాటు చార్జీలతో అన్ని వర్గాలపై భారం మోపాయ లని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన చార్జీలు తగ్గించాలని, ట్రూ అప్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కొనసాగించాలని అన్నారు. విద్యుత్ సవరణ  చట్టాలనుఉప సంహరించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పలు సమస్యల తో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ ఏ ఈ సురేష్ కు అందించారు. ఈ కార్యక్రమం లో సిఐటియు మండల కార్యదర్శి మహమ్మద్ కరీముల్లా, మండల కమిటీ సభ్యులు  నంద్యాల ప్రభు, వెనిగళ్ళ వసంతరావు, బండారు కోటేశ్వరరావు, గోళ్ల సాంబశివరావు, పల్లె సుబ్బారావు, ఘంటసాల ధర్మరాజు, వెంకటేశ్వరరావు, కలపాల దానయ్య, బళ్ళ వెంకటేశ్వరరావు, మహమ్మద్ ఫజు రిల్లా ఖాన్  సిపిఐ నేతలు హనుమాన్ ల సురేంద్రనాథ్ బెనర్జీ, అట్లూరి వెంకటేశ్వరరావు, పెనుమత్స ప్రభాకర్ రావు, పెనుమత్స రాజరత్నం, లంక మల్లి, వాసు తదితరులు పాల్గొన్నారు