Aug 05,2023 19:12

చిప్పగిరిలో ట్రాన్స్‌కో డిఇతో మాట్లాడుతున్న జడ్‌పిటిసి విరుపాక్షి

ప్రజాశక్తి - చిప్పగిరి
చిప్పగిరిలోని లింగాయత్‌ కాలనీలో దీర్ఘకాలికంగాలో లోవోల్టేజీ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పరిష్కారం చూపాలని జడ్‌పిటిసి విరుపాక్షి కోరారు. శనివారం చిప్పగిరికి వచ్చిన ట్రాన్స్‌కో డిఇతో జడ్‌పిటిసి విరుపాక్షి మాట్లాడారు. లోవోల్టేజీ సమస్యతో లింగాయత్‌ కాలనీలోని చాలా గృహాల్లో టీవీలు, ఫ్రిడ్జ్‌లు, నీళ్ల మోటార్లు కూడా సరిగా పనిచేయడం లేదన్నారు. కిందిస్థాయి సిబ్బందికి ఎన్ని సార్లు చెప్పినా పెడచెవున పెడుతున్నారని తెలిపారు. స్వయంగా వచ్చి చూస్తున్నందుకు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపి అదనంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ట్రాన్స్‌కో డిఇ మాట్లాడుతూ... సమస్యను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ట్రాన్స్‌కో ఎఇ ఉలిగన్న, రిలయన్స్‌ కోఆర్డినేటర్‌ తులసీరామ్‌, లింగాయత్‌ కాలనీ వాసులు పాల్గొన్నారు.