ప్రజాశక్తి-హిందూపురం : కరువు జిల్లాల విద్యార్థులకు సువర్ణ భారతి విద్యాసంస్థల ఆద్వర్యంలో వెలసిన లొటస్ పబ్లిక్ స్కూల్ ఒక వరం లాంటిదని సువర్ణ భారతీ విద్యాసంస్థల అధ్యక్షులు నీలకంఠరెడ్డి, శ్రీ కృష్ణదేవారాయ విశ్వవిద్యాలయ ఫ్రోఫెసర్ కొండురు నాగభూషణ రాజు అన్నారు. పెనుకొండ రోడ్డు కొట్నురు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిస లోటస్ పబ్లిక్ స్కూల్‌ను ఆదివారం లాంచనంగా ప్రారంభించారు. అనంతరం విద్యాసంస్థల అధ్యక్షులు నీలకంఠరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅథితులు కొండురు నాగభూషణ రాజు, గుత్తికి చెందిన గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఎమ్‌డి రఘునాథ్ రెడ్డి, శ్రీ వాణి, ఫ్రోఫెసర్ కెశవరెడ్డి, డాక్టర్ జెసిఆర్ బయో సైన్స్ సిఇఒ జయచంద్ర రెడ్డి, డాక్టర్ కె, రఘునాథ్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ నరసింహారెడ్డి, ప్రియ గంగధర్, మాజీ ఎమ్మేల్యే అబ్దుల్ ఘని, జెఇ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. హిందూపురం పట్టణంలో అంతర్జాతీయ వసతులతో విద్యార్థుల తల్లిదండ్రులు అభిరుచి మేరకు సువర్ణ భారతి విద్యాసంస్థల ఆధ్వర్యంలో లోటోస్ పబ్లిక్ స్కూల్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. సిబిఎసిఇ సిలబస్‌తో విద్యనందించడమే ు కాకుండా కేంద్ర ప్రభుత్వ నియమానుసారం అన్ని సౌకర్యాలను పాఠశాలలో ఏర్పాటు చేశామన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల సామార్థ్యనికి అనుగుణంగా ఐఐటి, మెడిసన్ ఇతర ఉన్నత విద్యా అవకాశాల పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతానికే ఈ పాఠశాల ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇదే సందర్బంగా పలువురు పట్టణ ప్రముఖులు సువర్ణ భారతి యాజమాన్యనికి అభినందించారు. ఈ కార్యక్రమాలలో సువర్ణ భారతి విద్యాసంస్థల కార్యదర్శి అనీల్ కుమార్, ట్రజరర్ రవీంద్రరెడ్డి, లోటస్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లన్స్ డైరెక్టర్ ప్రజీత్ రెడ్డి, ప్రిన్సిపల్ సూర్యనారాయణ, సువర్ణ భారతీ విద్యాసంస్థల అధ్యాపకులు, ఉపాద్యాయులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.










