Apr 30,2023 08:54

లోకేష్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న బికె.పార్థసారధి, పల్లె రఘునాథరెడ్డి

         పెనుకొండ : టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరంలో శనివారం జరిగింది. ఈ సందర్బంగా నారా లోకేష్‌ను టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి.కె.పార్థసారథి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిలు మర్యాదపూర్వకంగా కలిశారు. లోకేష్‌కు పుష్పగుచ్ఛం అందజేశారు. వర్షంలో లోకేష్‌ వెంట పాదయాత్రలో నడిచారు.
లోకేష్‌ను కలిసిన సవితమ్మ
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ శనివారం కలిశారు. కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం క్యాంప్‌ వద్ద లోకేష్‌ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. అంతకుముందు మంత్రాలయం రాఘవేంద్రస్వామిని ఆమె దర్శించుకున్నారు. ఆమె వెంట పెనుకొండ టీడీపీ నాయకులు ఉన్నారు.