లోకేష్ ను కలిసిన పోతుగుంట రాజేష్ నాయుడు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను హైదరాబాదులో శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధర్మకర్తల మండలి మాజీ అధ్యక్షులు పోతుగుంట గురవయ్య నాయుడు కుమారుడు డాక్టర్ పోతుగుంట రాజేష్ నాయుడు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. నారా లోకేష్ కు పుష్పగుచ్చం అందచేసి క్షేమ సమాచారాలు తెలుసు కున్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్న నారా చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితిని గురించి పోతుగుంట రాజేష్ నాయుడు అడిగి తెలుసుకున్నారు. ఇక శ్రీకాళహస్తిలో టిడిపి విజయానికి కషి చేయాలని పోతుగుంట రాజేష్ నాయుడుకు నారా లోకేష్ సూచించారు. ఇందుకు పోతుగుంట రాజేష్ అంగీకరించారు. శ్రీకాళహస్తిలో టీడీపీ-జనసేన పార్టీ ఉమ్మడి జెండా ఎగుర వేయడానికి తనవంతు కషి చేస్తానని రాజేష్ హామీ ఇచ్చారు.










