ప్రజాశక్తి - ముదినేపల్లి
యువజన వారోత్సవాల సందర్భంగా గుడివాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయిలో పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన క్విజ్ పోటీల్లో తమ స్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానం సాధించినట్లు లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ ప్రిన్సిపల్ బి.రఘురామయ్య గురువారం తెలిపారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన వీరమల్లు పావని, రొంపిచర్ల నిత్యశ్రీ, రాయగిరి కనకమణి కార్తికేయ, ఇనుపకుత్తిక రాజేశ్వరరాజులను ప్రిన్సిపల్‌తో పాటు ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు అభినందించారు.










