లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న హీరో శ్రీకాంత్, ఊహా
లేపాక్షి : లేపాక్షి దర్గా పాప్పన్నేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ హోరో శ్రీకాంత్, ఆయన భార్య ఊహ సందర్శించారు. మంగళవారం ఉదయం వారు ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. లేపాక్షి శిల్ప కళావైభవాన్ని తిలకించారు. ఆలయ అర్చకులు ఆలయ విశిష్టతను తెలియజేశారు. శాలువాతో సత్కారించి, నంది విగ్రహ జ్ఞాపికను అందచేశారు. ఈ సందర్బంగా శ్రీకాంత్ మాట్లాడుతూ లేపాక్షి ఆలయంలో శిల్ప కళాసంపద అద్భుతంగా ఉందన్నారు. అబ్బురపరిచేలా ఇక్కడ కట్టాడాలు ఉన్నాయ్నారు.










