ప్రజాశక్తి - కర్నూలు జిల్లాపరిషత్ : కర్నూలు జిల్లా కురవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని జడ్పీ ఆవరణలోని ఎంపీపీ హాల్ నందు జరిగిన వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రధాన కార్యదర్శి ఎం.కే.రంగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, ఉపాధ్యక్షులు కత్తి శంకర్ మాట్లాడుతూ కురువ కులస్థులు ఐక్యంగా ఉండాలని ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని, పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో వివిధ జిల్లాల నుంచి వివాహ సంబంధాల కోసం అత్యధికంగా రావడం జరిగిందని, 2003 నుంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం రామకృష్ణ గౌరవ అధ్యక్షులు కిష్టన్న ఆర్ అండ్ బి డిఇ వెంకటేశ్వర్లు కేసీ నాగన్న కర్నూల్ దేవేంద్ర పాల సుంకన్న ధనుంజయ రామకృష్ణ బి ఎన్ టాకీస్ వెంకటేష్ దివాకర్ తిరుపాల్ మద్దిలేటి ఎస్ నాగన్న తదితరులు పాల్గొన్నారు.










