Oct 14,2023 14:25

ప్రజాశక్తి-కర్నూలు స్పోర్ట్స్ : స్థానిక మౌర్య ఇన్ హోటల్ నందు టీజీ భరత్ ఛాంబర్ లో టైక్వాండోలో పథకాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది  టీజీ భరత్ విద్యార్థులకు పథకాలను అందజేసి అనంతరం ఆయన  మాట్లాడుతూ కడప జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో మన కర్నూలు జిల్లా పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని తల్లిదండ్రులు కూడా తమ విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని టైక్వాండో ఆత్మరక్షణ క్రీడా అని తెలియజేశారు. టైక్వాండో మాస్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల అవుట్డోర్ స్టేడియంలో టైక్వాండో స్కూల్ గేమ్స్ పోటీల ఎంపికలో కిడ్స్ వరల్డ్ పార్క్ లో సాధన చేసే విద్యార్థులు అండర్ 14 విభాగంలో టి అఖిల్, విసి మోహన్ కుమార్, బి కార్తీక్, సాయిరాం, కె రెహాన్, టి ఎం ఉమా, టిఎం హరిప్రియలు గోల్డ్ మెడల్ సాధించారు వి నిఖిల్, ఎస్ వసంత్ కుమార్, బి కమలేశ్వర్ సిల్వర్ మెడలు సాధించారు. అండర్ 17 విభాగంలో టిఎం గాయత్రి, పి హర్షిత్ బెన్ని, బి శ్యాంసుందర్, జీకే విశాల్, కే నవీన్, బి.చిరుచరణ్ తేజ గోల్డ్ మెడల్ సాధించారు దుర్గాప్రసాద్ సిల్వర్ మెడల్ సాధించారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు కడప జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి  పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్ వీరేష్ బాబు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.