ప్రజాశక్తి-మచిలీపట్నం రూరల్ : కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతిగా ఆంధ్ర యూనివర్సిటీ పూర్వ జువాలజీ ప్రొఫెసర్ జి.జ్ఞానమణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతిగా అవకాశం కల్పించినందుకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డికి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపకులపతి పదవి బాధ్యతలతో కూడు. అంబేద్కర్ యూనివర్సిటీ, శ్రీకాకుళం మొదటి రిజిస్ట్రార్ గా బాధ్యతలు నిర్వహించానని తెలియచేశారు. గత ఉపకులపతుల కృషిని అభినందిస్తూ వారు చేపట్టిన పనులను ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు.అందరి యొక్క సహకారంతో యూనివర్సిటీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తాను యూనివర్సిటీలో నిరంతరం అందరికి అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది ఆచార్య జి. జ్ఞానమణి నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామిరెడ్డి ఇతర అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.










