ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : నూతన జిల్లా కలెక్టర్ గా నియమితులైన పి.రాజాబాబు శనివారం మచిలీపట్నం నగరం కలెక్టరేట్ లోని వారి చాంబర్లో జిల్లా కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. వారికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి సాధర పూర్వకంగా ఆహ్వానం పలికారు. పలువురు జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.










